calender_icon.png 18 July, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల కోటాకు అడ్డుపుల్లలు వద్దు !

16-07-2025 12:00:00 AM

దేశంలో రాజ్యాధికారం కోసం వెనుకబడినవర్గాలు 77 సంవత్సరాలుగా కొట్లాడుతూనే ఉన్నారు. సమా జంలో ఇప్పటికీ విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు అందుకోలేని కులాలు కోకొల్ల లు ఉన్నాయి. ‘రాజ్యాధికారం అందుకోలే ని కులాలు రాను రాను అంతరిస్తాయి’ అని నాడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నారు. ప్రస్తు తం కొన్ని కులాల పరిస్థితి అలాగే కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికీ 80కి పైగా కులా లు రాష్ట్రంలో కనీసం వార్డు మెంబర్ స్థా యి పదవైనా దక్కించుకోలేదంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1970లో నాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరామన్ కమిషన్ వెనుకబడిన కు లాలను నాలుగు వర్గాలుగా విభజించింది.

బీసీలను ఏ- 7శాతం, బీ- 10శాతం, సీ -1 శాతం, డీ -7 శాతం గ్రూపులుగా చేసి, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వారికి రిజర్వేషన్లు అమలు చేయాలని కమిషన్ సిఫా ర్సులు చేసింది. ఆ మేరకు 1972 నుంచి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రాజకీయాల్లో లేని రిజ ర్వేషన్లు లేకపోవడంతో నాడు మళ్లీ బీసీల నుంచి ఒత్తిడి మొదలైంది. అలా 1980లో మురళీధర్‌రావు కమిషన్ ఏర్పడింది. బీసీ వర్గీకరణ చేసి రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు అమలు పరచాలని కమిషన్ నాటి ప్రభుత్వానికి సూచించింది. తర్వాత 1993 లో నాటి కేంద్ర ప్రభుత్వం 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్రాలకు కల్పించింది. ఏ

దేమైనా నాడు కాం గ్రెస్ ప్రభుత్వం సదుద్దేశంతో వెనుకబడిన కులాల వారికి కనీసం గ్రామ పంచాయతీ లు, మునిసిపాలిటీలు, జిల్లాపరిషత్ ఎన్నికల్లో రిజర్వేషన్ల ద్వారా బీసీలకు రాజకీయ ప్రవేశం కల్పించి, తద్వారా సామాజిక న్యా యం పాటించే దిశగా అడుగులు వేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభు త్వం ‘బీసీలకు పెద్దపీట వేస్తున్నాం..’ అం టూ గొర్లు, బర్లు ఇచ్చిందే కానీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50శాతం మించొద్దని హైకోర్టు కొట్టేసిందనే సాకుతో బీసీల రిజర్వేషన్లను 22కు తగ్గించి అన్యాయం చేసిం ది. తమ పార్టీ అధికారంలో జరిగిన ఈ అన్యాయాన్ని ప్రశ్నించని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు ‘బీసీ రిజర్వేషన్లు సాకారమయ్యేది  నా వల్లనే’ అంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరం. లిక్కర్ స్కాం కేసులో పోయిన పరువును ఇలా నిలబెట్టుకునేందుకే ఆమె జనాభా ప్రాతిపదికన రిజ ర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకొస్తున్నారనే అనుమానం తలెత్తున్నది.

కులగణన దేశానికే ఆదర్శం..

భారత్ జోడో యాత్రలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తమ ప్రభు త్వాలు ఉన్న అన్ని రాష్ట్రాల్లో కులగణన ఇస్తారని హామీ ఇచ్చారు. ఆ హామీని అం దుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చా క ఆచరణలో పెట్టారు. రాష్ట్రంలో కులగణన ప్రక్రియ చేపట్టి జనాబా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు అమ లు చేస్తామని భరోసానిచ్చారు. అన్నట్లే విజయవంతంగా కులగణన పూర్తి చేశారు. అలా దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామనే కాం గ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కూడా అమలు చేస్తామని రాష్ట్రప్రభుత్వం కంకణం కట్టుకున్నది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ మేరకు రిజర్వేషన్లు అమలు చేస్తా మని హామీ ఇచ్చింది. దీనిలో భాగంగానే శాసనసభలో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. బిల్లులకు చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంట్‌కు పంపించింది. కానీ, వాటిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మూడు నెలలుగా ఉలు కూ పలుకు లేకుండానే ఉంది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. అయినా ప్రయోజనం లేకపోయిం ది. ఓబీసీ జాతీయ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మం తర్ వద్ద మహాధర్నా కూడా నిర్వహించా రు. ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఆ ధర్నాకు దేశవ్యాప్తంగా 18 రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. అన్ని పార్టీలు కలిపి సుమారు 50 మంది ఎంపీలు ధర్నాలో పాల్గొన్నారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. తర్వాత కొద్దిరోజులకు హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదే అదనుగా భావించిన ప్రతిపక్షాలు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావని, అందు కు ఎన్నో చిక్కులు ఎదురవుతాయని విపక్షాలు మీడియాలో దుష్ర్పచారం చేశాయి. కానీ,  రాష్ట్రప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాటనిలబెట్టేందుకు పంచాయతీరాజ్ చట్టం- 2018, సెక్షన్ 285 (ఏ)ను సవర ణ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తద్వారా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది. తద్వారా ఇక బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలవుతా యనే నమ్మకం బీసీల్లో వచ్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు అన్యాయం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో నాటి ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టం తీసుకువచ్చి వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు వర్గీకరించకుండా ఉమ్మ డి రిజర్వేషన్లే అమలు చేసింది. నాడు అంగ బలం, అర్థ బలం ఉన్న కొన్ని ఆధిపత్య కులాలకు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందాయి. నాడు బీసీ కులాలకు చెందిన వారు కనీసం వార్డు మెంబర్, సర్పంచ్‌గా గెలవడం కూడా గగననమైం ది. అందుకు కారణంగా బీసీ వర్గాల వద్ద డబ్బు లేకపోవడమే. కనీసం బీసీలకు నాడు నామినేషన్ వేసేందుకైనా వారి వద్ద సొమ్ము లేదు.

నాడు ప్రభుత్వం తెచ్చిన లోపభూయిష్టమైన చట్టం.. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించింది. ఇప్పుడు తెలంగాణలో రాష్ట్రప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం లేదు. అంతకముందే ప్రభుత్వం ఆ అంశంపై విస్తృతమైన కసరత్తు చేసింది. శాస్త్రీయమైన పద్ధతిలో కులగణన చేపట్టింది. రాష్ట్రం జనాభాలో 10 శాతమైనా లేని అగ్ర వర్ణాలకు 10శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలు చేసినప్పుడు, మరి జనా భాలో 56.33 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం న్యాయమైన డిమాండే కదా.

అయితే.. ప్రభుత్వం న్యాయ వ్యవస్థ సూచన మేరకు సహేతుకమైన పరిమితుల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల్లో దామాషా ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 15 (4), 16 (4 ), 243 డీ (6), టీ (6) సవరిస్తే, న్యాయపరమైన చిక్కులు లేకుండా చేయొచ్చు. అలాగే ఈ చట్టం అమలుకు ఆటంకాలు ఉండవని ప్రభుత్వం భావించింది. ఒక రాష్ట్రప్రభు త్వం తలచుకుంటే వెనుకబడిన, అణగారి న వర్గాల హక్కులను ఎలా కాపాడుకోగలదో చెప్పడానికి.. తమిళనాడు ఒక స్పష్టమైన ఉదాహరణ. 1993లో అప్పటి తమిళనాడు ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసింది. ఆ నిర్ణయానికి రక్షణగా తొమ్మిదో షెడ్యూల్ ఉంది. 

తెలంగాణలో కూడా అలాగే రిజిర్వేషన్ల అమలుకు మార్గం సుగ మం కావాలంటే రాజకీయ పార్టీలు ప్రభు త్వ ప్రయత్నాలు అడ్డుకోకూడదు. బీసీ రిజర్వేషన్ల అమలుపై ఎలాంటి పేచీలు పెట్టకూడదు. ఇలాంటి సందర్భంలో కేంద్రంలోని బీజేపీ కూడా తెలంగాణ ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత తీసుకువచ్చేందుకు తొమ్మిదో షెడ్యూల్‌లో చేరేలా సహకరించాలి. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అన్ని రాజకీయ పార్టీల సహకారంతోనే జరుగుతుంది. ఎవరైనా ఆ సంకల్పానికి అడ్డుపుల్లలు వేస్తే, ఆయా పార్టీలకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు.

 వ్యాసకర్త సెల్: 98662 55355