17-07-2025 12:00:00 AM
నైరుతి రుతపవనాలు రాష్ర్టంలోకి ప్రవేశించాయి.కొన్ని జిల్లా ల్లో అధిక వర్షపాతాలు నమోదవుతున్నాయి. వానాకాలం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవ డం సహజం. పిడుగులు కొన్ని వేల మెగా వాట్ల శక్తి కలిగి ఉంటా యి. అవి జీవుల ప్రాణాలు తీయడంతో పాటు విలువైన వస్తువులను కాల్చి బూడిద చేస్తుంటాయి.
వర్షాకాలం ఆరంభంలో ఆకా శంలో జరిగే ఒత్తిడి, అలజడుల వల్ల పిడుగులు పడుతుంటాయి. వర్షం ప్రారంభం కాగానే నిర్లక్ష్యం విడిచి అప్రమత్తంగా ఉంటే పిడుగులబారి నుంచి కొంతవరకు బయటపడొచ్చు. ఆకాశంలో ఉరు ములు, మెరుపులతో వర్షం పడిన సందర్భాల్లో ఏదో ఒక చోట పిడుగుపాటుకు గురై ప్రతి ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్న వార్తలను మనం వింటూనే ఉన్నాం. మూగజీవాలు సైతం పిడుగులకు బలైపోతున్నాయి.
ఇలా చనిపోయే వారిలో అధిక శాతం పశువుల కాపరులు, వ్యవసాయ భూముల్లో పనిచేసుకునే రైతులు, కూలీలు ఉంటున్నారు. పిడుగుల ధాటికి కొందరు ప్రాణా లు వదులుతుండగా, మరికొందరు నష్టాలు చవిచూస్తున్నారు. పిడుగులు పడే సమాచారాన్ని విపత్తుల నివారణ శాఖ ముందుగానే పలు సందార్భాల్లో ప్రకటిస్తున్నప్పటికీ ప్రమాదాలు తప్పడం లేదు. పిడుగుల బారి నుంచి తప్పించుకోవడానికి అప్రమత్తతతో వ్యవహరించాలి.
గాలులు వీస్తున్నా, ఉరుములు ఉరిమినా పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది. ఆ సమయంలో సమీపంలో గల పెద్ద భవనాల్లోకి వెళ్లడం మంచిది. ఉరుములు, మెరుపులు, గాలి వాన సమయంలో ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు మిగతా వాహనాలు నడపడం మానుకోవాలి. లోహపు వస్తువులను తాకకుండా ఉండాలి. ఆరుబయట ప్రదేశాల్లో సెల్‌ఫోన్ వినియోగించవద్దు. ఉరుములు, మెరుపుల సమయంలో ఇళ్లలో తలుపులు, కిటికీలు మూసివేయాలి.
ఇంట్లో విద్యుత్‌తో నడిచే అన్ని వస్తువులకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికత వల్ల పిడుగులు పడే సమాచారాన్ని యాప్ ద్వారా సైతం తెలుసుకునే వీలుంది. యాప్ ద్వారా ఏ ప్రాంతంలో పిడుగు పడుతుందో కొంతవరకు తెలిసిపోతుంది. మనం ఎంత వరకు రక్షణ పొందవచ్చునో తెలుసుకునే వీలుంది. విపత్తుల నివారణ శాఖ సైతం వర్షం, పిడుగులు, ఉరుములు, మెరుపుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంటుంది.
ముందుగానే ఆయా జిల్లాలలో కలెక్టర్లు, మండలాల తహసీల్దార్లు, అధికారులను అప్రమత్తం చేస్తోంది. పిడుగుపాటుకు గు రైనపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా విపత్తుల శాఖ అధికారులు కరపత్రాలు, వాల్ పోస్టర్ల ద్వారా అవగాహన కల్పి స్తున్నారు. పిడుగు పాటుకు గురై మృత్యువాత పడిన బాధిత కుటుంబాలకు ప్రకృతి విపత్తు నష్టం కింద కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సాయం అందిస్తుంటాయి. అధిక ఓల్టేజీ వచ్చి ఇళ్లలోని విద్యుత్ గృహోపకరణాలు కాలిపోతుంటాయి. దీన్ని నివారించేందుకు ఇంటికి తప్పని సరిగా ఎర్తింగ్ ఏర్పాటు చేయాలని నిపుణు లు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఐఎస్‌ఐ మార్కు కలిగిన నా ణ్యమైన ఉత్పత్తులనే వాడాలి. విద్యుత్ ఉపకరణాలు బంద్ చేయాలి.
కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి