calender_icon.png 10 January, 2026 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించాలి

08-01-2026 12:00:00 AM

ఏసీపీ చక్రపాణి 

ఉప్పల్, జనవరి 7 (విజయక్రాంతి) : శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటించాలని డీజే సౌండ్ సిస్టం ఆపరేటర్లకు ఉప్పల్ ఏసిపి ఎస్ చక్రపాణి సూచించారు. బుధవారం రోజున ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న  ఫంక్షనల్ డీజే ఆపరేటర్స్ తో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శబ్ద కాలుష్యం సంబంధించిన నిబంధనలను వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.. అనంతరం నాచారంలో అర్ధరాత్రి వరకు డీజే నిర్వహిస్తే చర్యలు తప్పవని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్  అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ప్రభాకర్ రెడ్డి మై బల్లి పాల్గొన్నారు