02-12-2025 12:02:19 AM
దేవరకద్ర, డిసెంబర్ 1: జన విజ్ఞాన వేదిక మహబూబ్ నగర్ జిల్లా స్థాయిలో నిర్వహించిన చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో దేవరకద్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు రెసిడెన్షియల్ విభాగంలో మొదటి స్థానం సాధించడంతో పాటు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
పదవ తరగతి నుండి సాయి ప్రకాష్ రెడ్డి, తొమ్మిదవ తరగతి నుండి టి.కళ్యాణ్ రామ్, 8వ తరగతి నుండి అభినయ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్ డి. శ్రీనివాసులు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహించిన పాఠశాల ఉపాధ్యాయులు సతీష్ కుమార్, రవి, కిరణ్ కుమార్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.