calender_icon.png 2 December, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు మార్చాల విద్యార్థిని ఎంపిక

02-12-2025 12:01:00 AM

కల్వకుర్తి టౌన్, డిసెంబర్ 1 : రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు జడ్పీహెచ్ ఎస్ మార్చాల క్రీడాకారిణి ఎంపికైందని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు యాదయ్య గౌడు సోమవారం తెలిపారు.

గత నెలలో నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో M.J.P. జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి జూనియర్ కబడ్డీ బాలికల సెలక్షన్స్ లో డి. మౌనిక పదవ తరగతి జెడ్పిహెచ్‌ఎస్ మార్చాల క్రీడాకారిని  పాల్గొని ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపిక కావడం జరిగినది, ఈ రాష్ట్ర స్థాయి కబడ్డీ  క్రీడలు డిసెంబర్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు నల్గొండ జిల్లాలోని హాలియా లో జరుగుతున్న 51వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలలో నాగర్ కర్నూల్ జిల్లా జట్టు తరఫున ప్రాతినిథ్యం వహిస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు  వెంకటరమణ  పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారిణి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందనలు తెలియజేపారు.