02-12-2025 12:04:25 AM
గంగుల విజయ మోహన్ రెడ్డి పేరును ప్రకటించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
అడ్డాకుల, డిసెంబర్ 1: అడ్డాకుల మండల కేంద్రం సర్పంచ్ అభ్యర్థి అధికార పార్టీకి ఎవరికి మద్దతు తెలుపుతుందని ఉత్కంఠకు తెరపడింది. సర్పంచ్ అభ్యర్థిగా గంగుల విజయ మోహన్ రెడ్డిను మ్మెల్యే మధుసూదన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించారు.
జరగనున్న స్థానిక ఎన్నికల సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా విజయ మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్భంగా గంగుల విజయ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినందున డిసెంబర్ 5 న శుక్రవారం రోజు 12 గంటలు నామినేషన్ చేయడం జరుగుతుంది.
అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బంధువులు మిత్రులు వెంట తరలిరావాలని మద్దతు దారులతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తున్నాన్ని పేర్కొన్నారు. అందరికీ ఆత్మీయుడుగా ఉంటూకాంగ్రెస్ పార్టీ నుండి అడ్డాకుల సర్పంచిగా మీ ముందుకు వచ్చేందుకు ఆశీర్వదించాలని కోరారు. గ్రామ అభివృద్ధికి తోడ్పడుతానని గ్రామస్తులను ఆయన కోరారు.