29-11-2025 12:46:07 AM
నిర్మల్, నవంబర్ 2౮ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం రెండవ రోజున శుక్రవారం ఊపందుకుంది. జిల్లాలోని దస్తురాబాద్ కడెం ఖానాపూర్ పెంబి లక్ష్మణ చందా మామడ మండల పరిధిలోని 136 గ్రామపంచాయతీలకు మొదటి విడత నామినేషన్ల స్వీకరణ చేపడుతున్నారు రెండో రోజు 188 నామినేషన్లు సర్పంచులకు దాఖలు చేయగా వాడు మెంబర్లకు 276 నామినేషన్లు దాఖలు అయినట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు.
ఇప్పటివరకు సర్పంచ్ పదవికి 302 నామినేషన్లు దాఖలు కాగా వార్డు మెంబర్లకు సగం దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది శనివారం నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో పూట పోటీగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. నిర్మల్ జిల్లాలోని మారుమూల పెంబి మండలంలో ఏడు తండాల్లో ఏకగ్రీవ సర్పంచులను ఎన్నుకుంటూ తీర్మానం చేశాయి.
మామడ మండలంలో రెండు గ్రామ పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. నామినేషన్ల కేంద్రాలను కలెక్టర్ అభిలాష అభినం అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్ డిపిఓ శ్రీనివాస్ ఆర్డిఓ రత్నా కళ్యాణి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
నామినేషన్ల ప్రక్రియ సాఫీగా పూర్తి చేయాలి: కలెక్టర్ రాజర్షి షా...
ఆదిలాబాదు, నవంబర్ 28 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇచ్చోడ మండలం కోకస్ మన్నూర్, సిరికొండ గ్రామ పంచాయతీ, ఇంద్రవెల్లి మండలం ముత్నూర్, ఉ ట్నూర్ మండలం పులిమడుగు గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీక రణ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ ను పరిశీలించి, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలని, అవసరమైన పత్రాలు, విధివిధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులతో మాట్లాడిన కలెక్టర్ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలిపారు.
మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని, అధికారులు ఖచ్చితంగా సమయపాలన పాటించాల ని సూచించారు. ఇందుకు సంబంధించిన రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం ఎన్నికల నేపథ్యం లో ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద విధులు నిర్వహిస్తున్న స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ అధికారులను ఐటిడిఏ ఉట్నూర్ పీవో యువరాజ్ మర్మాట్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఈ తనిఖీలలో తహసిల్దార్లు రమేష్, తుకారాం, ప్రవీణ్ కుమార్, ఎంపీడీవోలు నరేష్, రాయిస్ ఉల్లా, జీవన్ రెడ్డి, రామ్ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, రిటర్నింగ్ అధికారులు, ఎస్‌ఎస్‌టీ బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా వచ్చిన నామినేషన్లే స్వీకరించాలి: కలెక్టర్ కుమార్ దీపక్
దండేపల్లి, నవంబర్ 28 : రెండవ సాధార ణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు సమర్పిం చే నామినేషన్లను నిర్ణీత గడువులోగా మాత్ర మే స్వీకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
శుక్రవారం దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ, ముత్యంపేట, రెబ్బెనపల్లి, చెల్కగూడ గ్రామాలకు కొర్విచెల్మ గ్రామపంచాయతీ, నెల్కివెంకటాపూర్, వందూర్ గూడ, చింతపల్లి, తానిమడు గు గ్రామాలకు నెల్కివెంకటాపూర్ గ్రామపంచాయతీ, ద్వారక, కొండాపూర్, ధర్మారా వుపేట గ్రామాలకు ద్వారక గ్రామపంచాయతీ, మ్యాదరిపేట, మామిడిపల్లి, కొత్త మామిడిపల్లి గ్రామాలకు మ్యాదరిపేట గ్రామపంచాయతీ,
దండేపల్లి, కర్ణపేట, నర్సాపూర్ గ్రామాలకు దండేపల్లి గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, ఎంపీడీఓ ప్రసాద్ లతో కలిసి సందర్శించి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.
ఈ నెల 29 వ తేదీన సాయంత్రం 5 గంటల లోగా నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుంచి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని, తర్వాత నామినేషన్ కేంద్రం గేటు మూసివేయాలన్నా రు. జిల్లాలో 3 విడతలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, మొదటి విడతలో 90 సర్పంచ్, 816 వార్డు సభ్యుల స్థానా కు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం మండలంలోని ద్వారక గ్రామంలో కొనసాగుతున్న షెడ్యూల్ తెగల బాలుర సంక్షేమ వసతిగృహం నిర్మాణ పనులను సందర్శించి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్ర మంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.