08-07-2025 01:40:05 AM
చిట్యాల, జూలై 7: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జూకల్ కు చెందిన లక్ష్మీ విద్యా నికేతన్ కరస్పాండెంట్ నూనె నరేందర్ బెస్ట్ సర్వీస్ సొసైటీ ఇంటర్నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు.
ఈ మేరకు ఆయన బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ చైర్మన్ నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా బహుజన సాహిత్య అకాడమీ హైదరాబాద్ నేషనల్ ఆఫీసులో బెస్ట్ సర్వీస్ సొసైటీ ఇంటర్నేషనల్ సాంక్షన్ లెటర్ ను అందుకున్నారు.
ఆయన తండ్రి నూనె రాజయ్య ఆశయాలను కొనసాగిస్తూ లక్ష్మీ విద్యానికేతన్ నడిపిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూన్నారు.ఈ అవార్డు సెప్టెంబర్ 5న సౌత్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ లో సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం రోజున అవార్డును అందుకోనున్నట్లు తెలిపారు.