08-07-2025 01:39:57 AM
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం, జూలై 7 (విజయక్రాంతి):కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంగా రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలీసు వృత్తిలో మ రింత నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంపొందించుకునేందుకు ఈ ’పోలీసు డ్యూటీ మీట్’ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం పేర్కొన్నారు.
నేర దర్యాప్తులో మరింత శాస్త్రీయత మరియు నైపుణ్యం కనబరిచే విధంగా ఈ పోటీలు జరుగుతాయని ఆ యన తెలిపారు.తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మట్ వరంగల్ లో నిర్వహించనున్నారు. దానిలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు రాజన్న జోన్ పరిధిలోని కరీంనగర్, సిద్దిపేట పోలీస్ కమీషనరేట్లు, మెదక్, కామారెడ్డి , సిరిసిల్ల జిల్లాల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో రాజన్న జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరుగుతోంది.
సోమవారంరాజన్న జోన్ పరిధిలోని అధికారులు సిబ్బందికి పలు విభాగాల్లో పోటీలు నిర్వహించదం జరిగింది.సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ లా, రాత పరీక్ష, మెడికో లీగల్ టెస్ట్, ఓరల్ టెస్ట్, లిఫ్టింగ్ అండ్ ప్యా కింగ్ ఆఫ్ ఎక్స్ బిట్స్, ప్రాక్టికల్ టెస్ట్, ఫింగర్ ప్రింట్ సైన్స్ (ప్రాక్టికల్ మరియు ఓరల్ టెస్ట్), క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ (ప్రాక్టికల్), పోలీస్ పోర్ట్రైట్ (ప్రాక్టికల్ మరియు రాత పరీక్ష), అబ్జర్వేషన్ టెస్ట్ (ప్రాక్టికల్ మరియు రాత పరీక్ష). యాంటీ సబాటేజ్ చెక్ లో భాగంగా వెహికల్ సెర్చ్, గ్రౌండ్ స ర్చ్, రూమ్ సెర్చ్,
యాక్సిస్ కంట్రోల్.కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్ విభాగంలో కంప్యూటర్ అవేర్నెస్, ఆఫీస్ ఆటోమేషన్, ప్రోగ్రామింగ్ ఎబిలిటీ.డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్లో ట్రాకింగ్, ఎక్స్పో్లజివ్, నార్కోటిక్స్, సెర్చ్.పోలీస్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ లోపోలీస్ వీడియోగ్రఫీ కాంపిటీషన్ లు నిర్వహించారు.ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారు ఈ నెలలో వరంగల్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ కి ఎంపిక చేయబడతారని కమీషనర్‌తెలిపారు.