15-10-2025 12:57:40 AM
- ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్
మహబూబాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): నార్మల్ డెలివరీలను ప్రోత్సహించి, గర్భిణి, బాలింతలు, చంటి బిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొనేలా చూడాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఐసిడిఎస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. మహబూబాబాద్ కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని రైతు వేదికలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభు త్వ నిర్ణయించిన మేరకు పోషణ మాసం కార్యక్రమం ఉమ్మడి కేసముద్రం మండలంలోని నాలుగు క్లస్టర్ల ను కలిపి ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ పాల్గొని మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు పిల్లలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. గర్భిణీ స్త్రీ పేరు నమోదు చేసిన నాటినుండి పోషణ గురించి వివరిస్తూ ఏ సమయానికి ఏ టీకాలు తీసుకోవాలో గర్భిణీ స్త్రీలలో రక్తహీనత సమస్య రాకుండా గర్భిణీ స్త్రీలు నార్మల్ డెలివరీ అయ్యేటట్లుగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయ్యేవిధంగా చర్య లు తీసుకోవాలన్నారు.
పిల్లలు జన్మించి తరా ్వత వారికి పోలియో, ఇతర టీకాలు సరియైన సమయానికి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, పోలియో రహిత ఆరోగ్య తెలంగాణ ఏర్పాటు అయ్యే దిశగా పనిచేయాలని, 18 సంవత్సరాలు నిండకుం డా బాల్యవివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా చైల్ లేబర్ యాక్ట్ ప్రకారంగా చిన్న పిల్లలను పనిలో ఉండకుండా బడిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు విక్రయిం చకుండా, అబార్షన్లు చేసుకోకుండా చూడాలని, ఆడపిల్లలను సంరక్షించే విధంగా చూ డాలన్నారు.
ప్రభుత్వం ఇస్తున్నటువంటి గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు సంబంధించిన గు డ్లు, పాలు, తప్పు దినుసులు, బాలామృతం వారికి అందే విధంగా చూడాలని కోరారు. సిడిపిఓ శిరీష, తహసిల్దార్ వివేక్, మున్సిపల్ కమిషనర్ రాజేం దర్, ఏవో వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, ఆర్టిఏ మెంబర్ రావుల మురళి, బండారు వెంకన్న, దస్రు నాయక్, బండారు దయాకర్, అంగన్వాడి సూపర్వైజర్లు దుర్గ, ప్రేమ జ్యోతి, పద్మావతి, విజయ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.