calender_icon.png 14 November, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూకలిప్టస్ చెట్లను నరికిన ఆరుగురి అరెస్టు

14-11-2025 01:10:36 AM

మేడ్చల్, నవంబర్ 13(విజయ క్రాంతి): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ బొల్లారం తండాలో యూకలిప్టస్ చెట్లను నరికిన ఇద్దరితోపాటు వీరికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు ట్రాక్టర్లను, రెండు టన్నుల యూకలిప్టస్ స్టంప్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

రాజు బొల్లారం తండా కు చెందిన బానోతు గౌతమ్, మాలవత అనిల్ రెండు యూకలిప్టస్ చెట్లను నరికి వేశారు. వీటిని తరలించేందుకు మాలోత్ రాజ్ కుమార్, బానోతు నవీన్ సహకరించారు. యూకలిప్టస్ స్టంప్స్ ను మాలవత్ నగేష్, మాలావత్ గోపి కొనుగోలు చేశారు. వీరందరినీ అరెస్టు చేయడమే గాక స్టంప్స్ ను, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.