calender_icon.png 26 July, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బిచ్చగాడు’ కాదు.. భద్రకాళి విజయ్ అంటారిక!

24-07-2025 12:00:00 AM

ఇటీవల ‘మార్గన్’తో అలరించిన విజయ్ ఆంటోనీ ఇప్పుడు మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ ‘భద్రకాళి’తో వస్తున్నారు. ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతం అందిస్తున్నారు.

ఈ రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాను ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను టీమ్ విడుదల చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. “ఇది నా 25వ చిత్రం. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు.

గతంలో వచ్చిన పొలిటికల్ సినిమాలన్నిటికీ డిఫరెంట్‌గా ఉంటుంది” అన్నారు. డైరెక్టర్ అరుణ్ ప్రభు మాట్లాడుతూ.. “‘భద్రకాళి’ తెలుగు విడుదులవుతున్న నా మొదటి చిత్రం. అన్నివర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా రిలేటబుల్‌గా ఉంటుంది” అన్నారు. నిర్మాత రామాంజనేయులు మాట్లాడుతూ.. “ప్రేక్షకులను ఆలోచింపజేసే సామాజిక అంశాలతో ఈ సినిమాను తీర్చిది ద్దాం.

విజయ్ ఆంటోనిని ఇప్పుడు ‘బిచ్చగాడు ‘ఫేమ్ అంటారు. ఈ సినిమా తర్వాత ‘భద్రకాళి’ విజయ్ అంటోని అని పిలుస్తారు” అన్నారు. ‘విజయ్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందిది’ అని ప్రొడ్యూసర్ ధనంజయన్ అన్నారు. హీరోయిన్ తృప్తి రవీంద్ర, నిర్మాత సురేశ్‌బాబు, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.