calender_icon.png 26 July, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిరాయ్ మ్యూజికల్ వైబ్స్!

24-07-2025 12:00:00 AM

హనుమాన్ సినిమాతో సూపర్ హీరోగా ప్రేక్షకులను అలరించిన యువ కథానాయకుడు తేజ సజ్జా. ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిరాయ్’ చిత్రంతో వస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మనోజ్ మంచు శక్తిమంతమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. శ్రేయ శరణ్, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ దేశవ్యాప్త ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ఇక ప్రేక్షకుల్లో మ్యూజికల్ వైబ్స్ కూడా రానున్నాయి. జూలై 26న ఈ సినిమా నుంచి తొలి గీతం ‘వైబ్ ఉంది’ని మేకర్స్ విడుదల చేయనున్నారు. ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాయకానాయికలు తేజ సజ్జా, రితికా నాయక్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. సెప్టెంబర్ 5న 2డీ, 3డీ ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం గౌర హరి వహిస్తుండగా, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీనాగేంద్ర తంగాల పనిచేస్తున్నారు. ఇక కథ, మాటల రచనలో మణిబాబు కరణం కీలక పాత్ర పోషించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా వ్యవహరిస్తూనే డీవోపీ, స్క్రీన్‌ప్లే బాధ్యతలనూ నిర్వర్తిస్తున్నారు.