24-07-2025 12:00:00 AM
యథార్థ సంఘటనల ఆధారంగా గ్రామీణ ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘ఉసురే’. టీజయ్ అరుణాసలం, జననీ కుణశీలన్ నాయకానాయికలుగా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాశి ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ డీ గోపాల్ దర్శకత్వంలో మౌళి ఎం రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కానుంది.
తాజాగా టీమ్ పాటల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా సీనియర్ నటి రాశి మాట్లాడుతూ.. “ప్రేయసి రావే’ చిత్రంలో హీరో శ్రీకాంత్‌ను కొట్టాను.. ఆ సినిమా హిట్ అయ్యింది. ఈ సినిమాలోనూ నేను హీరోను, హీరోయిన్లను కొట్టాను. నా అంచనా ప్రకారం ‘ఉసిరే’ కూడా హిట్. ఎందుకంటే నేను ఎవరిని కొడితే వాళ్ల సినిమా హిట్. నాక్కూడా ఈ సినిమా మంచి విజయాన్నిస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.
‘అచ్చ తెలుగు సినిమా చూసిన అనుభూతి కలుగుతుంద’ని దర్శకుడు, ‘ఇదొక రియల్ ఇన్‌సిడెంట్.. సమాజంలో జరుగుతున్న ఓ బర్నింగ్ ఇష్యూని ఈ చిత్రంలో చర్చించామ’ని నిర్మాత చెప్పారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు కిరణ్ జోజ్, మూవీ యూనిట్ పాల్గొన్నారు.