calender_icon.png 20 October, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారి కాదు.. వరద రహదారి

20-10-2025 12:37:29 AM

  1. రహదారులు కప్పేస్తున్న పొదలు

ద్విచక్ర వాహనదారులకు తప్పని తిప్పలు

ఆక్రమణలతో రోడ్డుపైనే బస్సులు

జాడ లేని జాతీయ రహదారి అధికారులు

అశ్వారావుపేట, అక్టోబర్ 19,(విజయక్రాంతి): ఖమ్మం_అశ్వారావుపేట  మధ్య 120 కిలోమీటర్ల రహదారి లో  సుమారు 80 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి కి ఇరువైపుల  చెట్లు, పొదలుపెరిగి , వాహనాలు ఎదరదరుగా వచ్చినప్పుడు ద్వి చక్ర వాహన దారులు గాని పాదచారులు గాని రోడ్ దిగే పరిస్థితి లేదు. 

దీనికి తోడు నారంవారి గూడెం కాలనీ ప్రాంతం లో నీ ఆయిల్ ఫామ్ నర్సరీ నుండి శ్రీ రంగాపురం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర వర్షం పడితే వరద నీరు మొత్తం జాతీయ రహదారి పై రెండు అడుగుల ఎత్తున ప్రవహిస్తుంది.నీరు ప్రవహిస్తున్న సమయం లో వాహన చోదకుల  వస్త్రాలు తడిచి, అందులో మహిళా లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వీటికి తోడు నారంవారి గూడెం కాలనీ వద్ద వ్యాపారులు బిటి రోడ్ వరకు ఆక్రమించుకోవటం తో వరద నీరు రహదారి పై పారుతుంది,ఈ రహదారి లో ఎక్కువ గా భారీ వాహనాలు  మితి మీరిన వేగం తో  ప్రయాణిస్తున్నాయి. దీనికి తోడు రహదారి కి ఇరువైపుల సైడ్ బర మ్స్ సక్రమంగా లేకపోవటం తో లారీలు రహదారి పై నే నిలుపుతున్నారు.

దీనితో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది.  వాహనాలు వేగంగా ప్రయాణిస్తూ ఓవర్  టెక్ చేసే సమయం లో ఎదురుగా వచ్చే వాహనాలు తప్పుకునేందుకు చోటు లేక ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

జాడ లేని జాతీయ రహదారి సంస్థ..

ఖమ్మం _అశ్వారావుపేట జాతీయ రహదారి కి సంబంధించి,  మరమ్మత్తులు, రహదారి ఇరువైపుల జంగిల్ క్లియర్ చేసేందుకు ఎన్ ఎచ్ ఏ ఐ (జాతీయ రహదారి సంస్థ)నీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ అధికారులు రోడ్ నిర్మాణ సమయం లో పర్యవేక్షణ చేసి ఉంటారని, ఆ తరవాత కాలం కన్నెత్తి చూడలేదని ప్రజలు వాపోతున్నారు.  ఈ రహదారి గురించి ప్రజా ప్రతినిధులు కు, అధికారుల దృష్టికి  తీసుకువెళ్లిన పట్టించుకున్న దాఖలాలు లేవు.

అంతే కాకుండా అశ్వారావుపేట పట్టణం లో సుమారు 300 మీటర్ల పొడవు రోడ్లు వెట్ మిక్స్ పోసి రెండు నెలలు కావస్తున్న ఇప్పటి వరకు బిటి నిర్మాణం చెప్పట్లేదు. ఆ ప్రాంతం లో లేచే దుమ్ము ధూళి కి అక్కడ ప్రజలు,  ఆ దారిలో ప్రయాణించే వారు  తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా శ్వాస కోస వ్యాధి భారిన పడుతున్నారు.

ఇన్ని సమస్యలు ఉన్న జాతీయ రహదారి సంస్థ అధికారులు సందర్శించిన దాఖలాలు లేవు. ఇప్పటికైన అధికారులు ఈ రహదారిని సందర్శించి,  పొదలు తొలిగించి, రహదారిపైకి వరద రాకుండా చర్యలు చేపట్టి, పట్టణం లో బి టి నీ త్వరతిగతి న పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.