calender_icon.png 13 September, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ప్రముఖ కవి జయరాజుకు అస్వస్థత

21-07-2024 02:35:42 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (విజయక్రాంతి) : ప్రముఖ కవి జయరాజు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం అర్థరాత్రి ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను నిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. బ్రెయిన్ స్ట్రోక్ ప్రభావంతో ఆయన ఎడమ కాలు, ఎడమ చేతికి పక్షపాతం వచ్చినట్టుగా వైద్యులు గుర్తించారు. చికిత్స అనంతరం జయరాజు కోలుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తొలుత ఐసీయూలో వైద్యం అందించిన నిమ్స్ వైద్యులు శనివారం నాటికి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో జనరల్ వార్డుకు మార్చారు. శనివారం పలువురు ప్రజా సంఘాల నాయకులు, కవులు, కళాకారులు పరామర్శించారు. జయరాజును పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ, ప్రముఖ ప్రజా కవి గోరటి వెంకన్న, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, విజ్ఞాన దర్శిని అధ్యక్షులు రమేష్, ప్రముఖ కవి భూపతి వెంకటేశ్వర్లు, ప్రముఖ సినీ సంగీత దర్శకులు బల్లేపల్లి మోహన్ తదితరులు ఉన్నారు.