calender_icon.png 13 September, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా హక్కుల పరిరక్షణకు కృషి

21-07-2024 02:36:39 AM

కాప్రా, జూలై 20: ప్రజా హక్కుల పరిరక్షణకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కృషి చేస్తోందని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇన్‌చార్జ్ చైర్‌పర్సన్ విజయ భారతి పేర్కొన్నారు. కుషాయిగూడలోని మేడ్చల్ మల్కాజిగిరి కోర్టును శనివారం ఆమె సందర్శిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవ హక్కులపై ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. తప్పు చేసిన వ్యక్తికి చట్టపరంగా శిక్షపడాల్సిందేనని, ఎవరైనా కావాలని కేసులను తప్పుదోవ పట్టిస్తే కమిషన్ సుమోటోగా స్వీకరించి తగిన న్యాయం చేస్తుందని తెలిపారు.

మానవ హక్కులకు భంగం కలిగితే  కమిషన్ తప్పకుండా జోక్యం చేసుకుంటుందని అన్నారు. అనంత రం ఆమెను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా కోర్టు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మోహన్ పాల్గొన్నారు.