calender_icon.png 26 September, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్‌గౌడ్ కన్నుమూత

26-09-2025 12:06:03 AM

  1. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణవాది
  2. భౌతికకాయాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించిన కుటుంబ సభ్యులు
  3. మంత్రులు సహా పలువురు ప్రముఖుల సంతాపం

హైదరాబాద్, సెప్టెంబర్ 25(విజయక్రాం తి): ప్రముఖ రచయిత, సామాజిక చరిత్రకారుడు, తెలంగాణవాది కొంపెల్లి వెంకట్‌గౌడ్ గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో తెలంగాణ సాహితీ లోకం విషాదంలో మునిగిపోయింది. పలువురు సాహిత్యకారులు, ప్రముఖులు తదితరులు ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వెంకట్‌గౌడ్ భౌతికకాయాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జీవితం, అనుభవాలను ‘వొడువని ముచ్చట‘ పుస్తకం రూపంలోకి ప్రజల ముందుకు తీసుకువచ్చా రు.  తెలంగాణకు చెందిన నీటి పారుదల నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆర్. విద్యాసాగర్‌రావు ఆలోనను ‘నీళ్ల’ ముచ్చటగా పుస్తక రూపంలోకి తీసుకొచ్చి ఘనత చాటారు.

ప్రముఖ సాహితీవేత్త నోముల సత్యనారాయ ణ వంటి ప్రముఖుల జీవితాలను కూడా కొం పెల్లి వెంకట్ గ్రంథస్తం చేశారు. గౌడన్నల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన సర్దార్ సర్వాయి పాప న్న చరిత్రను అక్షర బద్దం చేసి నేటి తరానికి అందించినఘనత ఆయనకే దక్కింది. తన జీవిత కాలంలో తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెం కట్‌గౌడ్ కీలకపాత్ర పోషిం చారు. తన రచనలతో బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా అభివృద్ధి కల గాలన్న ఆలోచనతో తన సాహిత్య జీవితాన్ని కొనసాగించారు.   

పలువురు ప్రముఖుల సంతాపం

కొంపెల్లి వెంకట్‌గౌడ్ మరణం పట్ల రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తదితరులు సంతాపం తెలిపారు. కొంపెల్లి వెంకట్ గౌడ్ ఆకస్మిక మరణం తీవ్ర విషాదాన్ని కలిగించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయన సాహిత్య రంగంలో, సమాజ సేవలో, తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు ఈ దుఃఖాన్ని తట్టుకుని ధైర్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ కూడా వెంకట్‌గౌడ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూడా వెంకట్‌గౌడ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణ సాహిత్య రంగానికి ఇది పూడ్చలేని లోటన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వెంకట్‌గౌడ్ కీలక పాత్ర పోషించారని కేసీఆర్ పేర్కొన్నారు.వెంకట్ గౌడ్ కుటుంబ సభ్యులకు, మిత్రులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు ‘ ప్రముఖ రచయి త, తెలంగాణ మట్టిబిడ్డ కొంపల్లి వెంకట్‌గౌడ్ ఇక లేరన్నవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి హఠాన్మరణం తెలంగాణ సాహిత్య రంగానికి, ప్రజలకు తీరని లోటు.

వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అని కేటీఆర్ పేర్కొన్నారు. కొంపెల్లి వెంకట్‌గౌడ్ హఠాన్మరణం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.  తెలంగాణ తత్వం, ఉద్యమ భావజాలాన్ని తన కలంలో నింపుకున్న వెంకట్‌గౌడ్ మృతి సాహిత్యరంగానికి తీరని లోటు’ అంటూ హరీశ్‌రావు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.