calender_icon.png 13 September, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూలైఫ్ ఆసుపత్రికి నోటీసు

22-09-2024 02:06:11 AM

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న న్యూలైఫ్ ప్రైవేట్ ఆసుపత్రికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి స్వరాజ్యలక్ష్మి షోకాజ్ నోటీసు జారీ చేశారు. వైద్యం కోసం వచ్చిన మహిళ పట్ల ఆసుపత్రి నిర్వాహకుడు, ఆర్‌ఎంపీ ఎండి సమీర్ అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. శనివారం సిబ్బంది ఆసుపత్రికి చేరుకోగా మూసి ఉండటంతో ఆసుపత్రి గోడకు నోటీసులను అంటించారు.