10-12-2025 06:44:20 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం రెండు కోతులు కొట్లాడగా ఒక కోతి మృతిచెందింది. మున్సిపల్ కమిషనర్ రమేష్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది స్మశాన వాటికకు తీసుకెళ్లి చనిపోయిన కోతికి అంత్యక్రియలు చేశారు. కోతికి అంత్యక్రియలు నిర్వహించిన సిబ్బందిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ క్రాంతి, సానిటేషన్ సూపర్వైజర్ న్యాతరి రాజ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.