10-12-2025 06:50:36 PM
హనుమకొండ (విజయక్రాంతి): ప్రముఖ మెజీషియన్ జాదూగర్ సికిందర్ ప్రదర్శనలు గురువారం నుండి అంబేద్కర్ భవన్ లో ప్రారంభిస్తున్నట్లు ప్రముఖ మెజీషియన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హనుమకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాన్పూర్ నుండి విచ్చేసిన మెజీషియన్ సికందర్ అంతర్జాతీయ స్థాయి ఇంద్రజాల ప్రదర్శనలు హన్మకొండ అంబేద్కర్ భవన్ లో డిసెంబర్ 11 నుంచి 28 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
డిల్లీ, హైదరాబాద్, ముంబాయి లాంటి ప్రముఖ నగరాలలో వివిధ వేదికలపై పదివేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చిన ప్రఖ్యాత మెజీషియన్ సికందర్ హన్మకొండలో తన మ్యాజిక్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి వస్తున్నారన్నారు. ఈ ప్రదర్శనలో కొత్తదనం, వైవిధ్యం రెండూ ఉంటాయనీ, ప్రతి మెజిషియన్ కు వారి స్వంత ప్రత్యేక శైలి ఉంటుందనీ, సికందర్ బృందం డైనోసార్ భ్రమ, బెర్ముడా ట్రయాంగిల్ ప్రభావం, అనేక ఇతర ఉత్కంఠభరితమైన ఇంద్రజాల విన్యాసాలను ప్రదర్శిస్తుంది అన్నారు.కొత్త షో, కొత్త స్టైల్, కొత్త అనుభవంతో ప్రతిరోజూ రెండు షోలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మెజీషియన్ కళ్యాణ్, కృష్ణ,రాము తదితరులు పాల్గొన్నారు.