10-12-2025 06:46:00 PM
నవాబుపేట: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నవాబుపేట ఎస్సై విక్రమ్ ప్రకటించారు. 11వ తేదీన జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, మీటింగ్స్ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసినందున వారి అన్ని గ్రామాలలో సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్, 144 సిఆర్, పిసి అమలులో ఉందని, అభ్యర్థులు గాని వారి అనుచరులు గాని ఎవరైనా ఇకముందు ఎన్నికల ప్రచారం చేసినా, గుంపులు గుంపులుగా ఉన్నా, ఓటర్లను ప్రలోభపెట్టినా డబ్బులు, మద్యం, పంపిణీ చేసినా, ఇతర పార్టీల వారిని కించపరిచేలా మాట్లాడినా, వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించినా కూడా కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన చెప్పారు.
ఓటర్లు సరైన సమయానికి పోలింగ్ బూత్ కి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్సై తెలిపారు. కోరారు. అదనంగా నేరుగా గాని వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా గాని, సామాజిక మాధ్యమాల ద్వారా గాని ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు హాజరైనా నియంత్రణ చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలియజేసారు