calender_icon.png 11 December, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముసాయిదాపై అభ్యంతరాలు, సూచనలు అందించాలి

10-12-2025 07:20:28 PM

డిప్యూటీ కమిషనర్ శైలజ..

మేడిపల్లి (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ యొక్క వార్డు పరిమితుల పునర్నిర్మాణము(డీలిమిటేషన్ అఫ్ వార్డ్స్) కు సంబంధించిన ముసాయిదా ప్రకటన(డ్రాఫ్ట్ పబ్లికేషన్) ఈరోజు బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో ఫామ్-1 ద్వారా డిప్యూటీ కమీషనర్ ఎ. శైలజా విడుదల చేయడం జరిగింది. ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడానికి ఈ ముసాయిదా ప్రచురించారని, కొత్తగా ప్రతిపాదించిన 300 వార్డులకు సంబంధించిన ముసాయిదా ప్రకటన బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి. పౌరులు తమ సూచనలు, అభ్యంతరాలు లిఖిత పూర్వకంగా బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఈ నెల 16లోగా ఇవ్వాలని, పౌరులు తమ విలువైన అభ్యంతరాలు, సూచనలు అందించాలని డిప్యూటీ కమీషనర్ ఎ.శైలజ తెలిపారు.