calender_icon.png 23 May, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుస ఘటనలతో మావోయిస్టులు విలవిల

22-05-2025 01:31:20 AM

హైదరాబాద్, మే 21: ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్‌మడ్ ప్రాంతం లో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 27మంది మావోయిస్టులు మృతి చెందడం నిషేధిత మావోయిస్టు సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఎన్‌కౌంటర్‌లతో మావోయిస్టులు విలవిలలాడు తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఈ ఏడాది మరణించిన మావోయిస్టుల సంఖ్య 200కు చేరుకుంది.

ఇందులో బస్తర్ ప్రాంతంలోనే 183 మంది ఉన్నారు.  ఇటీవల ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట పర్వతాల్లో 24 రోజుల పాటు జరిగిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు 31 మంది మావోయిస్టులను హతమార్చిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం బస్తర్‌లో 217 మందితో సహ 219 మంది మావోయిస్టులు మృతిచెందారు.