calender_icon.png 16 September, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలేజీలకు ప్రభుత్వం పైసా ఇవ్వలే

16-09-2025 01:14:01 AM

-ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలకు రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఒక్క పైసా ఇవ్వలే, బకాయిలు విడుదల చేయాలని కోరుతూ కాలేజీల అసోసియేషన్లు తలపెట్టిన బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు స్పష్టంచేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లపైగా ఉన్నప్పటికీ, రెండేళ్లుగా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవ డంతో ప్రైవేట్ కాలేజీలు ప్రొఫెసర్లు, లెక్చరర్ల కు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్ప డిందన్నారు. ప్రభుత్వం గత ఆరు నెలలుగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడుతూ ‘మేమ త్వరలో పరిష్కారం చేస్తాం’ అని చెప్పినా, ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన నిర్ణయం కానీ, బకాయిలు విడుదల కానీ చేయలేదని మండిపడ్డారు.

గత అసెం బ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డులు ఇస్తామని వాగ్దానం చేసిందని, కానీ ఆ హామీ ఇప్పటివరకు అమలుకావడం లేదని ఆరోపించారు. ఈ నిర్లక్ష్య ధోరణిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని, విద్యా వ్యవస్థను కాపాడటం రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన బాధ్యతని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.