calender_icon.png 20 October, 2025 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు

18-10-2025 01:30:32 AM

ఐదు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ 

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ సూచించింది. ఈమేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 వేగంతో గాలులు సైతం వీస్తాయని తెలిపింది.

శనివారం మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షా లు కురిసే అవకాశముందని తెలిపింది. ఆదివారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కా మారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గ ద్వాల్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.