25-11-2025 12:00:00 AM
ఉన్నత విద్యామండలితో ప్రతినిధి బృందం భేటీ
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోవడానికి నాటింగ్‌హమ్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం తెలంగాణ ఉన్నత విద్యామండలిని సోమవారం సందర్శించింది. పాఠ్యాంశాల అభివృద్ధి, విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌తోపాటు పలు సంస్కరణల గురించి విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వారికి వివరించారు.
సాంకేతికత, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యావిధానంలో తీసుకొచ్చిన మార్పుల గురించి ప్రతినిధి బృందానికి ఆయన వివరించారు. రాష్ట్రంలోని వర్సిటీలతో పలు అంశాలపై ఒప్పందం చేసుకునేందుకు నాటింగ్‌హమ్ వర్సిటీ బృందం ఆసక్తి కనబరిచినట్లు ఆయన తెలిపారు.