25-11-2025 12:00:00 AM
మేడ్చల్ అర్బన్, నవంబర్ 24 (విజయ క్రాంతి): ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రావల్ కోల్ గ్రామంలో స్పీడ్ బ్రేకర్లు వేయాలని సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి ఎం నరేష్ మాట్లాడుతూ ప్రతిరోజు కంకర టిప్పర్లు, ట్రాక్టర్లు అధిక లోడుతో వేగంగా వెళుతున్నాయని అన్నారు.
వీటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. భారీ వాహనాలను చూసి ప్రజలు భయపడుతున్నారు అన్నారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే వాహనాల వేగం తగ్గే అవకాశం ఉందన్నారు. ఎల్లంపేట మున్సిపల్ మేనేజర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సిపిఎం కార్యదర్శి నరేష్ తెలిపారు.