calender_icon.png 7 November, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక.. ప్రతి గంటా లెక్కే!

07-11-2025 12:00:00 AM

  1. నిర్లక్ష్యం వద్దు.. మూడు రోజులు చాలా కీలకం
  2. బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి
  3. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మనకే అనుకూలం 
  4. పోల్ మేనేజ్మెంట్ ప్రధానం
  5. మంత్రులు, పీసీసీ చీఫ్, పార్టీ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశా నిర్దేశం

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి) : ఉన్న మూడు రోజులు చాలా కీలకం.. ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు.. అప్రమత్తంగా ఉండాలి.. ఇప్పటి నుంచి ప్రతి గంటా మనకు లెక్కే.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకే అనుకూల పరిస్థితులు ఉన్నాయి.. అందరూ కలిసికట్టుగా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సా ధిస్తామని మంత్రులు, పీసీసీ చీఫ్, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి ఉ ద్బోధించారు.

ముఖ్యంగా బీఆర్‌ఎస్ చేసే తప్పుడు ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. సీఎం రేవం త్‌రెడ్డి గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్య క్షుడు మహేష్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ప్రచార కార్యక్రమాలు, క్షేత్ర స్థాయి పరిస్థితులు, సర్వే నివేదికలు, వ్యూహ, ప్రతి వ్యూహాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఎన్నికల ప్రచారానికి ఇక మూడు రోజులే ఉన్నందున పకడ్బందీగా ముందుకు వెళ్లాలని సూచించారని, ఇప్పటి నుంచి ప్రతి గం టనూ సద్వినియోగం చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని, భవిష్య త్‌లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను కూడా వివరించాలని దిశానిర్దేశం చేసిన ట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా చే స్తున్న దుష్ప్రచారాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని సీఎం సూచించినట్లు సమాచారం.  క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌కు బలం ఉందని, నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని గ్రౌండ్ రిపో ర్టులు చెబుతున్నాయని సీఎం ధీమావ్య క్తం చేసినట్లు తెలిసింది. రాబోయే మూ డు రోజుల్లో పోల్ మేనేజ్మెంట్‌పై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించిన ట్లు సమాచారం. 

పోలింగ్ శాతం పెంచాలి 

జూబ్లీహిల్స్  ఉప ఎన్నికలో పోలింగ్ శాతం పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించినట్లు తెలిసింది. నియోజక వర్గంలో నాలుగు లక్షల ఓటర్లు ఉండగా, పురుషు లు 2.8 లక్షలు, మహిళలు 1.92 లక్షలకు పైగా, ఇతరులు 25మంది ఓటర్లు ఉన్నారని సీఎం వివరించినట్లు సమాచారం. వీళ్లంతా 139 పోలింగ్ కేంద్రాల్లోని 407 పోలింగ్ బూతుల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికలో  పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. 2009లో 52.76 శాతం, 2014- 50.18 శాతం, 2018- 45.59 శాతం, 2023- 47.49 శాతం పోలింగ్ నమోదైందని సీఎం రేవంత్‌రెడ్డి లెక్కలతో సహా వివరించినట్లు తెలిసింది. ఇప్పుడు పోలింగ్ శాతం పెంచేందుకు ప్రతి ఓటరు పోలింగ్ కేంద్ర వరకు వచ్చే లా చర్యలు తీసుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పినట్లు తెలిసింది.

బస్తీలు, కులాల వారీగా సమీక్ష 

నియోజక వర్గంలోని బస్తీల్లో ఉన్న వివిధ వర్గాల ప్రజలు , కులాలు, మతాలకు చెందిన వారిపైన సమీక్షలో చర్చించినట్లు సమాచారం. ముస్లిం, క్రిస్ట్టియన్ ఇతర వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని, ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు మనవైపే ఉన్నారని సీఎం వివరించారు. బస్తీల్లో నివసిస్తున్న ప్రజలు కూడా పార్టీకి ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారని, కానీ చివరి మూడు రోజుల్లో పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమని తెలిపారు.