calender_icon.png 6 August, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంతార3లో ఎన్టీఆర్?

06-08-2025 01:08:54 AM

కంటెంట్ బాగుంటేనే కమర్షియల్‌గా సక్సెస్ సాధ్యమనే విషయాన్ని ‘కాంతార’ నిరూపించింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడమేకాక ఆ సినిమాలో కీ రోల్ ప్లే చేశారు. ఇప్పుడు రెండోభాగం రాబోతోంది. ఓ వైపు పార్ట్ ఇంకా సెట్స్‌పైనే ఉండగానే మూడోభాగం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ‘కాంతార-3’ వార్తనే అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇందులో రిషబ్ శెట్టితోపాటు ఎన్టీఆర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరగడమే కారణం.

గతంలో ఎన్టీఆర్ తన తల్లి షాలిని నందమూరితో కలిసి బెంగళూరులోని ఓ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా రిషబ్‌శెట్టి వారికి ఆతి థ్యం ఇచ్చారు. అప్పుడే రిషబ్.. ఎన్టీఆర్‌తో ‘కాంతార-3’ కథపై చర్చించారట. ఎన్టీఆర్‌కు కథ బాగా నచ్చిందని, అందుకే ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.

ఎన్టీఆర్ తల్లి కర్ణాటకలోని కుందాపూర్‌కు చెందిన వ్యక్తి కావడం, ‘కాంతార’లో చూపించిన కోలా రిచ్యువల్స్‌తో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉండటం కూడా ఈ కాంబో కుదరడానికి కారణమని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ‘కాంతార-3’లో ఎన్టీఆర్ పాత్రపైనా ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ సీక్వెల్‌లో ఎన్టీఆర్‌ది కేవలం క్యామియో రోల్ కాదని, కథలో కీలకమైన పాత్రలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వుర్ ఇండియా’ కవర్ పేజీలో ఎన్టీఆర్ ఫొటోలు మొదటిసారి కనిపించడంతో అభిమానులు వాటిని సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు.