20-11-2025 04:57:42 PM
నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల మండలంలోని తాండూర్ గేటు సమీపంలో 10 హెక్టర్లు ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ను, మాల్తుమ్మెద నర్సరీనీ, రామయపల్లిలో పది హెక్టార్లు గల ప్లాంటేషన్ను స్టేట్ విజిలెన్స్ ఎఫ్ఆర్ఓ వీరేశం, డిఆర్ఓ శశిధర్లు తనిఖీ చేశారు.పనులు బాగున్నాయని మొక్కలు బాగా ఎదిగాయని సంతోషం వ్యక్తం చేస్తూ నాగిరెడ్డిపేట్ ఫారెస్ట్ సిబ్బందిని అభినందించారు. ఫారెస్టు కార్యాలని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ వాసుదేవరావు, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ రవికుమార్, బీట్ ఆఫీసర్ నవీన్, సుప్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.