18-08-2025 12:57:24 AM
మన్సూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో రోగులకు అందని వైద్య సేవలు
ఎల్బీనగర్, ఆగస్టు 17 : ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వం ఎన్ని నిధులు మంజూరు చేసినా.... ఎన్ని చర్యలు తీసుకున్నా పేదలకు ప్రభుత్వ వైద్య సేవలు అందడం లేదు. గతంలో ’నేను రాను బిడ్డ... ప్రభుత్వ దవాఖానకు’ అనే రోజుల నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ దవాఖానల్లో ఎలాంటి మార్పు లేదు. మన్సూరాబా ద్ ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో వైద్యులు కనిపించరని...
నర్సులు, ఇతర సిబ్బంది వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు నిత్యం వస్తున్నాయి. సీజనల్ తోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రభుత్వ దవాఖానకు వస్తే నిరాశే మిగులుతుంది. ఇక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు, ఇతర సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యులు ఇ ష్టానుసారంగా విధులకు హాజరవుతూ తాము వచ్చేవరకు రోగులు ఉంటే సరి..
లేదంటే కిందిస్థాయి సిబ్బంది ఇచ్చిన మందులు తీసుకొని వెళ్తున్నారు. దవాఖానకు వచ్చిన ఒక మహిళ మా ట్లాడుతూ.. వైద్యులు అందుబాటులో ఉండరని, నర్సులు ఇచ్చే మందులు తీసుకుంటున్నామని చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి మన్సూరాబాద్ లోని ప్రభుత్వ దవాఖానలో నాణ్యమైన వైద్యసేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలుకోరుతున్నారు.