25-10-2025 08:35:04 PM
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ అక్టోబర్ 25 (విజయ క్రాంతి): ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన పౌష్టికాహారం గురించి ప్రతి ఇంట్లో అవగాహన కల్పించడమే పోషణ మాసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోనీ రెడ్డి సంఘంలో శనివారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఒక కుటుంబం ఆరోగ్యంగా ముందుకు సాగాలంటే మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళలు, గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో పోషకాహారం ప్రాముఖ్యత చాలా ఉందని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది పోషకాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు.