calender_icon.png 23 December, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాభివృద్ధి ఏకైక లక్ష్యం

23-12-2025 12:24:36 AM

చిన్యా తండా సర్పంచ్ హరిచంద్

కేసముద్రం, డిసెంబర్ 22 (విజయక్రాంతి): గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్యా తండా గ్రామ సర్పంచ్ జాటోత్ హరిచంద్ తెలిపారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఇనుగుర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి బండారు పార్థసారథి సర్పంచ్ హరిచంద్ చేత పదవి ప్రమాణం చేయించారు. అనంతరం ఉపసర్పంచ్ గుగులోతు కవిత, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా స ర్పంచ్ హరిచంద్, మాజీ సర్పంచ్ అరుణను వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. అనంతరం హరిచంద్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చే స్తానని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో తన భార్య అరుణను, ఈసారి తాను సర్పంచ్ గా ఎన్నుకున్న గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.