23-08-2025 01:15:04 AM
దేశవ్యాప్తంగా 37 నగరాల్లో ఒబెన్ షోరూమ్‌లు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (విజయక్రాంతి): ఆర్ అండ్ డీ ఆధారిత స్వదేశీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిలీ తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ తన 50వ షోరూం, సర్వీస్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో శుక్రవారం ప్రారంభించింది.
ఈ ఆర్థిక సంవత్స రం చివరి నాటికి దేశవ్యాప్తంగా 150కి పైగా షోరూంలను ప్రారంభించాలని సంస్థ లక్ష్యం గా పెట్టుకుంది. ఒబెన్ ఎలక్ట్రిక్ ఇటీవల గుంటూరు (ఏపీ), రాంచీ(జార్ఖండ్), అలీగఢ్, ఉన్నావ్ (యూపీ), పాలక్కాడ్ (కేరళ) లోనూ నూతన బ్రాంచీలు ప్రారంభించింది.
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 37 నగరాల్లో సంస్థ తన ఉనికిని చాటుకుంది. ఒబెన్ ఎలక్ట్రిక్ తన తదుపరి తరం కమ్యూటర్ మోటార్ సైకిల్ రోర్ ఈజడ్, కొత్తగా ప్రారంభించిన రోర్ ఈజడ్ సిగ్మా కోసం కోసం బలమైన మార్కెట్ డిమాండ్ కారణంగా ఈ వేగవంతమైన విస్తరణ ముందు కు సాగుతోంది.
ఒబెన్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకురాలు, మధుమితా అగ్రవాల్ మాట్లాడుతూ, ‘మా 50వ డీలర్‌షిప్ భారతదేశమంతటా ఎలక్ట్రిక్ మొ బిలిటీని అందుబాటులోకి తీసుకురావాలనే ఒబెన్ ఎలక్ట్రిక్ దృష్టి వైపు బలమైన అడుగు’ అని పేర్కొన్నారు.
గణేశ్ చతుర్థిని పురస్కరించుకొని ఒబెన్ తన వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఒబెన్ ఎలక్ట్రిక్ మోటర్ సైకిళ్లు కొనుగోలు చేసేవారికి బంగారు నాణెన్ని అందిస్తోంది. ఈ ఆఫర్ 2025, సెప్టెంబర్ 15 వరకు అందుబాటులో ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.