23-08-2025 01:14:55 AM
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, ఆగస్టు 22(విజయక్రాంతి): ప్రతి ఒక్కరు సామాజిక సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కొణిదెల యువసేన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆధ్వర్యంలో గురువారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని రాంనగర్ ఎస్‌ఆర్ టి కమ్యూనిటీ హాల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రముఖుల తమ అభిమాన హీరోల జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రామ్ నగర్ డివిజన్ మాజీ అధ్యక్షులు రావులపాటి మోజెస్, మెగాస్టార్ అభిమానులు నాగరాజు, నాగేష్, వరంగల్ శీను, బాబు, నరేష్, శ్రీనివాస్ యాదవ్, మెగా విజయ్, వరుణ్, కిట్టు, రవి తదితరు పాల్గొన్నారు.