calender_icon.png 14 August, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి అధికారులకు తగు సూచనలు

14-08-2025 12:00:00 AM

 సదాశివ నగర్,ఆగస్టు 13 (విజయ క్రాంతి ); రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న  వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ సత్యనారాయణ సూచించారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలందరినీ అప్రమ  త్తంగా ఉంచాలని, అవసరమైతే తప్ప బయటకు ఎవరు రావద్దని, వర్షాలపై ప్రజలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేయాలని సూచించారు. పురాతన ఇళ్లను, శిధిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రజలకు అందుబా టులో ఉండాలని అధికారులకు సూచించారు.  ఎంపీడీవో సంతోష్ కుమార్, ఎంపీ ఓ సురేందర్, పుష్పరాజ్, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

తాడ్వాయి  పరిషత్ కార్యాలయంలో..

తాడ్వాయి, ఆగష్టు, 13( విజయ క్రాంతి): రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి అన్న వాతావరణ శాఖ సూచన మేరకు మండలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తాడ్వాయి మండల ప్రత్యేక అధికారి శివకుమార్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా గ్రామాల్లో ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు మూడు రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, తాసిల్దార్ శ్వేత,ఎస్త్స్ర మురళి తదితరులు పాల్గొన్నారు.