calender_icon.png 14 August, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇకపై ఒక్క రోజులోనే వీసా జారీ

14-08-2025 12:00:00 AM

  1. విదేశీ విభాగం ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశం
  2. వీసా విధానం సులభతరం, అక్రమ వలసదారుల నియంత్రణపై సమీక్ష 

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): ఇప్పటి వరకు వీసా జారీ చేసేందు కు కొన్ని వారాల సమయం పట్టేది. అన్ని పత్రాలు సమర్పిస్తే ఇకపై ఒక్క రోజులోనే వీ సాను పొందే అవకాశాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో వెసులు బాటు తీసుకొచ్చింది. అలాగే అక్రమ వలసదారులు, గడువు మించి ఉండే విదేశీయుల పై పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు డిస్ట్రిక్ట్ పోలీస్ మాడ్యూల్, ఫారినర్స్ ఐడెంటిఫికేషన్ పోర్టల్స్‌ను ప్రారంభించింది.

హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ అధ్యక్షతన బుధవారం న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో విదేశీ విభాగం ఉన్నతాధికారులతో సమీ క్షా సమావేశం నిర్వహించారు.  వీసాల విధానాల సరళతరం, ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ఆ ధునీకరణ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయా అంశాల్లో పురోగతిని అ ధికారులకు, కేంద్ర మంత్రికి వివరించారు. వీసా విధానాన్ని సులభతరం చేసేందుకు అ నేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

వీసా పొందేందుకు ఉన్న 26 సబ్ కేటగిరీలను 22కి కుదించామని,  104 సబ్ కేటగిరీలుంటే 69కి తగ్గించినట్లు వెల్లడించారు. 2024లో జా రీ చేసిన మొ త్తం వీసాలలో ఈ వీసాల వాటా 65.15 శాతం అని... వీసా విధానాల సులభతరం వల్ల  వీసా జారీ సగటు సమయం కొన్ని వారాల నుంచి ఒక రోజులోపు తగ్గినట్లు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ఆధునీకరణలో భాగంగా ఆటోమేటెడ్ ట్రావెల్ డాక్యుమెంట్ స్కానింగ్, బయోమెట్రిక్ నమోదు సదుపాయాలను కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.

2014 నాటికి దేశంలో 82 ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టులుండగా... ప్రస్తుతం 114కి (వీటలో 37 ఎయిర్, 37 రోడ్డు, 34 సముద్ర, 6 రైల్వే) పెంచినట్లు వివరించారు. అట్లాగే ఢిల్లి, ముంబై, చెన్ను, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్‌లలో ఫాస్ట్ -ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం అమలు చేస్తున్నట్లు పేర్కొన్న అధికారులు...

ప్రీ-వెరిఫైడ్ ప్రయాణికులు ఈ విమానాశ్రయాల్లో కేవలం ఒకే ఒక్క నిమిషంలోనే ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందవచ్చునని వివరించారు. ఇప్పటివరకు సుమారు 50 లక్షల ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులు జారీ చేయడంతోపాటు ఓసీఐ పోర్టల్‌ను పునరుద్ధరించి మరింత సులభమైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.