calender_icon.png 14 August, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులను సందర్శించిన ఎస్పీ

14-08-2025 12:00:00 AM

కామారెడ్డి, ఆగస్ట్ 13 (విజయ క్రాంతి):  జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. బుధవారం కామారెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులను పోలీస్ సిబ్బందితో కలిసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల నీటి ప్రవాహం తీసుకోవాలిసిన చర్యలు, వివిద శాఖల అధికారులతో సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా వరద ఉధృతతో రోడ్లు తెగిపోయిన, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని, రోడ్డుకు ఇరువైపులా స్టాపర్స్ పెట్టి ప్రజల రాకపోకలను నిలుపుదల చేయాలని సూచించారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలతో, ప్రజాప్రతినిధుల తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకుని తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  వాగులు చెరువులు కుంటలు వర్షపు నీటితో నిండిన క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలను కుటుంబ సభ్యులను వాగులు చెరువులు కుంటలను తిలకించేం దుకు ఎవరు వెళ్లవద్దని సూచించారు.

నిర్విరామంగా కురిసే వర్షాల కారణంగా విద్యుత్ స్థంబా లకు ఎర్థింగ్ ద్వారా విధ్యుత్ సరఫరా అయ్యి కరెంట్ షాక్ తగిలే అవకాశం వున్నందున జిల్లా ప్రజలు పిల్లలు ఎవరు కూడా విద్యుత్ స్థంబాలను కానీ విద్యుత్ పరికరాలను ముట్టుకోకుండా జాగ్రత్తగా వుండాలని, అలాగే విధ్యుత్ సరఫరా లో ఏదైనా లోపం ఉంటే వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని లేదా వరద ఉద్ధృతి ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని సూచించారు. ఎవరైనా సమస్యలో లేదా ఇబ్బందుల్లో ఉంటే డయల్ 100 లేదా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08468-220069 నెంబర్లకు సమాచారం అందించినచొ తక్షణ సహాయక రక్షణ చర్యలు చేపడుతామని జిల్లా ఎస్పి తెలిపారు.