calender_icon.png 25 November, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక

25-11-2025 12:33:32 AM

అలంపూర్, నవంబర్ 24: స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బిఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అలంపూర్ పరిధిలోని ఎర్రవల్లి మండల కేంద్రం నుంచి పలువురు బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.సోమవారం శాంతినగర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజాపాలనలో గా గ్రామాల అభివృద్ధికి చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను,మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, పల్లె నిర్మల, రాజు, పెద్ద ఎత్తున  కార్యకర్తలు పాల్గొన్నారు.