calender_icon.png 25 November, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌కు బీనమోని మధుప్రియ

25-11-2025 12:32:20 AM

పదర, నవంబర్ 24: పదర మండల కేంద్రానికి చెందిన ఇంటర్ చదువుతున్న బీనమోని మధు ప్రియ రాష్ట్రస్థాయి అండర్-19 స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్లో అత్యంత ప్రతిభ కనబరిచింది. హైదరాబాద్ జింఖానా మైదానంలో జరిగిన పోటీల్లో 1,500 మీటర్ల పరుగు, 3,000 మీటర్ల పరుగు రెండు విభాగాల్లోనూ రజత పతకాలు కైవసం చేసుకుని జాతీయ స్థాయికి అర్హత సాధించింది.

ప్రస్తుతం నల్గొండ జిల్లా డిండి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల అథ్లెటిక్స్ అకాడమీలో కోచ్ పరశురాముడు వద్ద శిక్షణ పొందుతుంది. ఈ  నెల 26, 28 వరకు హర్యానా రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటున్నట్లు కోచ్ పరశురాముడు తెలిపారు.