calender_icon.png 25 November, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి

25-11-2025 12:33:01 AM

సిద్దిపేట కలెక్టరేట్,నవంబర్:24ప్రజావాణిలో వచ్చే అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే  పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాల నుండి 123 అర్జీలు అందాయి. ప్రజ లు తమ సమస్యలు అధికార యంత్రాంగం ద్వారా తప్పక పరిష్కారం అవుతాయనే విశ్వాసంతో ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని కలెక్టర్ అన్నారు.

ప్రతి శాఖ అధికారి దరఖాస్తులను పరిష్కరించి చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. రానున్న నాలుగు రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ లభ్యతను పరిశీలించాలని,వర్షాల ప్రభావం వల్ల పంట నష్ట పోకుండా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

త్వరలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పర్యటన ఉండటంతో ఏర్పాట్లు వెంటనే మొదలుపెట్టాలని కలెక్టర్ సూచించారు. అంగన్వాడీ, గ్రామపంచాయితీ భవనాలు, రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ డిఆర్‌ఓ నాగ రాజమ్మ, ఏఓ రాజ్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.