30-10-2025 12:13:57 AM
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
హుజూర్‌నగర్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
మెంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి అధికారులు సమన్వయనంతో పనిచేసి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.
అవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బయటికి రావద్దని సూచించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు అందుబాటులో ఉండి అధికారులతో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.