25-07-2025 02:40:36 AM
మేయర్ గద్వాల విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో వర్షా లు కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గ ద్వాల విజయలక్ష్మి ఆదేశించారు. గురువారం మేయర్ జోనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, నగరంలో జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని మేయర్ తెలిపారు.
జోనల్ కమిషనర్లు, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల కు తక్షణమే స్పందించాలని సూచించారు. హైడ్రాతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
వర్షం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వర్షానికి సంబంధించిన ఫిర్యాదులు లేదా సహాయం కోసం ప్రజలు జీహెచ్‌ఎంసీ -డీఆర్‌ఎఫ్‌ను 040-29555500, 040-21111111 లేదా 9000113667 నంబర్లలో సంప్రదించాలని, లేదా హైడ్రాకు ఫిర్యాదు చేయాలని సూచించారు.