26-07-2025 04:03:38 PM
ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలి
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,(విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలనీ కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని సాయికుంటలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థినుల హాజరు, వసతి, ఆహారం, శౌచాలయాల పరిస్థితి, శుభ్రత వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందుతున్నాయా! లేదా! అనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
పరిశీలిస్తూ.. ప్రశ్నిస్తూ...
ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల తరగతి గదులను కలెక్టర్ కుమార్ దీపక్ తిరిగి పరిశీలించారు. పిల్లలతో స్వయంగా మాట్లాడుతూ పాఠ్యాంశాలలోని ప్రశ్నలు అడిగి పిల్లల సామర్థ్యాలను పరీక్షించారు. విద్యా ప్రమాణాలను పరీక్షించేందుకు గణితం, హిందీ విషయాల్లో విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి జ్ఞానాన్ని తెలుసుకున్నారు. విద్యార్థులు ఉత్సాహంగా సమాధానాలు చెప్పడంతో కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ వెంట డిస్ట్రిక్ట్స్ ట్రైబల్ ఆఫీసర్ జనార్ధన్, పాఠశాల హెచ్ఎం గంగాదేవి తదితరులు ఉన్నారు.