calender_icon.png 27 July, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

62 ఏళ్ల వృద్ధుడికి అరుదైన సర్జరీ

25-07-2025 02:39:19 AM

  1. బైలేటరల్ ప్రాక్సిమల్ హ్యూమరస్ ఫ్రాక్చర్ సర్జరీ విజయవంతం
  2. రెనోవా సెంచరీ హాస్పిటల్స్ వైద్యుల ఘనత

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): రెనోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్ వైద్య బృందం 62 ఏళ్ల వృద్ధుడికి అరుదైన సర్జరీ చేశారు. ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలి రోటరీ నగర్‌కు చెందిన 62 ఏళ్ల వ్యక్తి జారి పడిపోవడంతో నెల రోజులుగా రెండు భుజాలలో తీవ్రమైన నొప్పి, వాపు, గాయాలతో బాధపడుతున్నాడు. రెండు చేతులను కదపలేకపోతున్నాడు.

కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించగా ‘బైలేటరల్ ప్రాక్సిమల్ హ్యూమరస్ ఫ్రాక్చర్‘ తో బాధపడుతు న్నారు అని తప్పనిసరిగా సర్జరీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. బైలేటరల్ ప్రాక్సిమల్ హ్యూమరస్ ఫ్రాక్చర్ చికిత్స కోసం ఖమ్మం, హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్స్‌ను సంప్రదించగా లక్షల్లో ఖర్చు అవుతుందని తేల్చారు. దిక్కుతోచని స్థితిలో రెనోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారా హిల్స్‌ను సంప్రదించారు.

ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ హిమకాంత్ లింగాల, హెచ్‌వోడీ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఆంకోసర్జన్, వారి సహచర వైద్య బృందం డాక్టర్ విజయ్‌కుమార్‌రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, చీఫ్ ట్రామా సర్జన్, డాక్టర్ అనూప్‌రెడ్డి సామ, కన్సల్టెంట్ షోల్డర్, స్పోరట్స్ సర్జన్ ఈ కేసును ఛాలెంజ్ గా పరిగణించి చికిత్సను ప్రారంభించారు. బైలేటరల్ ప్రాక్సిమల్ హ్యూమరస్ ఫ్రాక్చర్ చికిత్సలో కుడి భుజానికి రైట్ రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ,

ఆ తరువాత ఫిలోస్ ప్లేట్ ఫిక్సేషన్ ఉపయోగించి ఎడమ భుజానికి ఓపెన్ రిడక్షన్ అండ్ ఇంటర్నల్ ఫిక్సేషన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్ర చికిత్సానంతరం పేషెంట్ పూర్తి ఆరోగ్యంతో వారం రోజుల్లోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎంతో సంక్లిష్టమైన ఈ శస్త్ర చికిత్సను 6 నుంచి 8 గంటల పాటు శ్రమించి విజయవంతంగా పూర్తి చేశామని డాక్టర్ విజయ్ కుమార్‌రెడ్డి, డాక్టర్ అనూప్‌రెడ్డి సామ తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కడ రాజీ లేకుండా చికిత్స అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా పేషెంట్ కుటుంబ సభ్యులు రెనోవా సెంచరీ హాస్పిటల్స్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.