26-07-2025 04:29:03 PM
ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): ప్రైవేటు పాఠశాలలో తమ పిల్లలను చదివించాలనే కోరిక ఉన్న పేద తల్లిదండ్రులకు అందుబాటు ఫీజులతో, నగరాలలోని కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఇల్లెందు డివిజన్ లోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని ఆ సంఘం నాయకులు తెలిపారు. శనివారం ట్రస్మా అనుబంధ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇల్లెందు డివిజన్ ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం స్థానిక 14 నెంబర్ బస్తీ మార్గదర్శిని ఇంగ్లీష్ మీడియం హై స్కూల్(Margadarshini English Medium High School) నందు డివిజన్ అధ్యక్షుడు జవహర్ హైస్కూల్ వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర నాయకులు తుమ్మలపల్లి ప్రసాద్ మాట్లాడుతూ కార్పోరేట్ విద్యా సంస్థల వ్యాపార ప్రకటనల ముందు తమ లాంటి బడ్జెట్ పాఠశాలలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని అన్నారు.
ప్రభుత్వం, పౌర సమాజం కార్పోరేట్ విద్యా సంస్థలతో బడ్జెట్ పాఠశాలలను పోల్చి చూడవద్దని కోరారు. తాము జీవనోపాధి పొందుతూ అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ సంపూర్ణ అక్షరాస్యత కోసం తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో ట్రస్మా రాష్ట్ర నాయకులు, ఇల్లెందు మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ట్రస్మా జిల్లా నాయకులు సరస్వతి హైస్కూల్ నామా సుధాకర్, మాంటిస్సోరి హైస్కూల్ డాక్టర్ సుధాకర్, మార్గదర్శిని హైస్కూల్ డైరెక్టర్స్ యాదగిరి రాంబాబు, అర్వపల్లి రాధాకృష్ణ, ప్రియదర్శిని మహేందర్, మాస్టర్ మైండ్ హైస్కూల్ కరస్పాండెంట్ సర్వేశ్వరరావు, కాకతీయ హైస్కూల్ కరస్పాండెంట్ రాం చందర్, ఎం ఆర్ జి నారాయణ హైస్కూల్ కరస్పాండెంట్ ఒంగూరి శ్రీను, స్వాతి స్కూల్ కరస్పాండెంట్ రామకృష్ణ, కొమరారం గ్రీన్ హుడ్ స్కూల్ కరస్పాండెంట్ సుధాకర్, జవహర్ హైస్కూల్ సాయి తదితరులు పాల్గొన్నారు.