calender_icon.png 27 July, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు

26-07-2025 04:26:46 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలో ఎన్సిసి క్యాడెట్ల ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దినోత్సవ(Kargil Vijay Diwas) వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సివి రామన్ డిగ్రీ కళాశాల, మిమ్స్ కళాశాలల ఎన్సిసి కాడేట్లు మాజీ సైనికుల సహకారంతో బెల్లంపల్లి చౌరస్తాలోని విజయ్ కార్గిల్ విగ్రహం వద్ద కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. వారు దేశం కోసం అందించిన విజయాలను కొనియాడారు. అప్పటి సందర్భాలను, వారు చేసిన పోరాటాలను మాజీ సైనికులు ఎన్సిసి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు భాస్కర్, సివి రామన్ డిగ్రీ కళాశాల ఏ ఎన్ ఓ ప్రశాంత్ కుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసి ఆఫీసర్ జాడి మహేష్ కుమార్, ఎన్సిసి కాడేట్లు పాల్గొన్నారు.