26-07-2025 04:08:23 PM
జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట,(విజయక్రాంతి): భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా ఆయా గ్రామాల్లో స్వీకరించిన అప్లికేషన్ లను యుద్ధ ప్రాతిపాకన డిస్పోజల్ చేయాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా సముదాయంలో కాన్ఫరెన్స్ హాల్లో ఆర్డీవోలు, తాహాసిల్దారులు, భూభారతి స్పెషల్ అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ... ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. భూ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టం అమలులో భాగంగా జిల్లాలో విజయవంతంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ప్రజల నుంచి భూ సమస్యల పై వచ్చిన దరఖాస్తులను భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.