calender_icon.png 27 July, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ వెంకటేష్ దోత్రే

26-07-2025 03:46:37 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను శనివారం సబ్ కలెక్టర్ శ్రద్ధా శక్లా తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఫర్టిలైజర్ల గుణనాత్మకత, ధరల నియంత్రణ, లైసెన్స్ నిబంధనల మేరకు రైతులకు ఎరువులు, విత్తనాల సరఫరా చేసే విధానంపై  పరిశీలించారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని  వ్యవసాయ అధికారులను ఆదేశించారు. 

రైతుల నుండి ఏవైనా ఫిర్యాదులు వస్తే తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.రైతుల హితాలను కాపాడటం మా ప్రధాన ప్రాధాన్యత. ఫర్టిలైజర్ డీలర్లు నాణ్యత, న్యాయమైన ధరలను నిర్ధారించాలి" అని పేర్కొన్నారు.   అన్ని షాపులు నియమాలను పాటిస్తున్నాయో లేదో నిరంతరం మానిటరింగ్ చేయడం జరుగుతున్న తెలిపారు. సబ్ కలెక్టర్ శ్రద్ధా శక్లా ఫర్టిలైజర్ షాపుల్లో స్టాక్ రిజిస్టర్లు, ఇన్వాయిస్లు ,లైసెన్స్ దస్తావేజులను  పరిశీలించారు. ఏ షాపులోనైనా నియమాల ఉల్లంఘన కనిపిస్తే కఠిన  చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హెచ్చరించారు.